మనన్యూస్,హస్తినాపురం:ఎల్ బి నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లోని జయశ్రీ ఎంక్లేవ్ లో వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ బ్యాంక్వెట్ హల్ ఓనర్స్ ఎస్.వెంకట రెడ్డి, ఏ లక్ష్మారెడ్డి, కోమటిరెడ్డి,నర్సిరెడ్డి, తిరుపతి రెడ్డి, తిరుమలరావులను వారు అభినందించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. వివాహాది శుభకార్యాలు,బర్త్ డే ఫంక్షన్స్ తక్కువ ధరల్లో నిర్వహించుకోవచ్చునని, స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
