

ఎల్బీనగర్: మన న్యూస్
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా వెళ్లే దారిలో ప్రొప్రైటర్ రాజు నేతృత్వంలోని హయాగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా లక్ష్మీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మి హాజరై,హయగ్రీవ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ వనస్థలిపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం ద్వారా ఈప్రాంత వాసులకు వైద్య సేవలు మరింత దగ్గరయ్యాయి అన్నారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ హాస్పిటల్ ని స్థాపించామని హయగ్రీవ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ రాజు తెలిపారు.తమ హాస్పిటల్ లో పిల్లల నుండి పెద్దల వరకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో ఇంజాపూర్ కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి, రవీందర్ రెడ్డి,డాక్టర్ హేమ,డాక్టర్ వాణి, వినోద్, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు