మనన్యూస్,నెల్లూరు:రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధికార ప్రతినిధిగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డిని వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, మల్లు సుధాకర్ రెడ్డి, యేసునాయుడు, షేక్ మొయిద్దీన్, ఐరెడ్డి సుబ్బారెడ్డి, స్వర్ణ జీవన్ ప్రసాద్, బోయల ఆదిరెడ్డి, షేక్ నవాబ్ జాన్, నాగా శ్రీనివాసులు రెడ్డి, కొండేటి నరసింహారావు, చెరుకూరు మధు, షేక్ సందానిభాష, షేక్ అల్లాబక్షు, బెల్లంకొండ వెంకయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *