

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కుల మత భేదాలను విడనాడి సమాజంలో ఐక్యతను,సోదర భావం కల్పించడం అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్,మహమ్మద్ రియాజ్ భారత్ చోడో యాత్రి,రియాసత్ నాయక్,మొహమ్మద్ అఖీల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కుల మత భేదాలను విడనాడి సమాజంలో ఐక్యతను,సోదర భావం కల్పించడం అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్,మహమ్మద్ రియాజ్ భారత్ చోడో యాత్రి,రియాసత్ నాయక్,మొహమ్మద్ అఖీల్ తదితరులు పాల్గొన్నారు.
