మనన్యూస్,తిరుపతిఃజనసేన 35వ డివిజిన్ నాయకులు డాక్టర్ హరికృష్ణా రాయల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రైల్వేకాలనీలోని వార్డు సచివాలయం ఆవరణలో ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ శిభిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వయంగా బిపి పరీక్ష చేయించుకున్నారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. జనసేన శ్రేణులు పేదలకు సేవ చేయడంలో ముందుండాలని ఆయన కోరారు. డాక్టర్ హరికృష్ణ వైద్యశిభిరం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యకర్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ అఖిల, డాక్టర్ కళ్యాణ్ కుమార్ లతోపాటు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పోరేటర్లు వరికుంట్ల నారాయణ, అన్నా అనితా యాదవ్, ఎన్డీఏ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య,రాజా రెడ్డి, నైనార్ శ్రీనివాస్, కంచి శ్యామల, గుత్తా నాగరాజు రాయల్, ఆర్సీ కుమార్, ఆముదాల వెంకటేష్, ఆళ్వార్ మురళీ, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
