మనన్యూస్,తిరుపతి:ప్రస్తుత పరిస్థితులలో క్షత్రియుల ఐక్యత అత్యవసరమని పలువురు క్షత్రియ సోదరులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలోని మెక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఆవరణలో స్థానిక క్షత్రియ సోదరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజులు మాట్లాడుతూ భవిష్యత్తులో క్షత్రియుల ఐక్యతకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. క్షత్రియ ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్న క్షత్రియ సోదరుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రుక్మాంగదరాజు, దొరస్వామి రాజు, భాస్కర్ రాజు, సుకుమార్ రాజు, రెడ్డయ్య రాజు, భాస్కర్ రాజు తదితరులు మాట్లాడుతూ రాజులు రాజకీయంగా సామాజికంగా బాగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో క్షత్రియుల ఐక్యత అత్యవసరం అన్నారు. ఈ దిశగా భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేసి ప్రతి మాసంలో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక దినాలలో కుటుంబ సమేతంగా హాజరై ముఖాముఖిగా కలుసుకొని క్షత్రియుల బలోపేతానికి కృషి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీరితోపాటు అధిక సంఖ్యలో క్షత్రియ సోదరులు పాల్గొన్నారు.
