మనన్యూస్,గొల్లప్రోలు:సోతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆశయాలు అమలు కు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కుంచె అంజి బాబు పిలుపు నిచ్చారు.ఆదివారం గొల్లప్రోలు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ లో అమర వీరుడు భగత్ సింగ్ 94 వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నాయకులు డి.నారాయణ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షుడు కుంచె అంజి బాబు పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సోతంత్ర పోరాటం లో యువతను మేల్కొలిపి పోరాటానికి సిద్ధం చేసిన యువ కిషోరం గా తెలిపారు.94 సంవత్సరాల వర్ధంతి సభలను ప్రతి పల్లెలో నిర్వహించి నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ సోమ్రాజ్యవాదం నశించాలి, మతోన్మాదం నశించాలి, పెట్టుబడి దారుల కభంద హస్తాలు నుండి ఈ దేశాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలోకుంచె అంజిబాబు డి నారాయణ మూర్తి గొర్ల శివ వేగిశెట్టి గణేష్ బల్ల సోమరాజు కేశవరపు రాజు కే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
