మనన్యూస్,పిఠాపురం:ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా… హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో… పిఠాపురం స్థానిక మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 8 మరియు 9వ తరగతి విద్యార్థులకు… నీటి పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచన పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు షీల్డ్ మరియు ప్రశంసా పత్రము, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.
నీటి పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి… భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి కార్యక్రమాలు విద్యార్థి దశ నుండే మొదలుకావాలని వివరించడం జరిగింది. ఈ అవగాహనా కార్యక్రమంలో… మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారు, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు గారు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు గారు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా… మైక్ అనౌన్స్మెంట్ ఆటో ద్వారా పిఠాపురం పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్లకార్డుల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
