

మనన్యూస్,తిరుపతి:ముంతాజ్ హోటల్ నిర్మాణంపై హిందూసంఘాల ఆధ్వర్యంలో అలిపిరిలో చేయదలచిన నిరసనకు గాను హిందూ విలేకరుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డిని వారి నివాసంలో తిరుచానూరు పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు.ఐతే నిరసన కార్యక్రమం విరమించడం జరిగింది.శాంతి భద్రతల దృష్ట ముందస్తు హౌస్ అరెస్టు చేశారు.ఈ సందర్బంగా మునిరామ్ రెడ్డి మాట్లాడుతూ గురువారం రాత్రి 10 గంటలకు హిందూ సంఘాల ప్రతినిధులకు సియంవో ఆపీసు నుంచి అందిన సమాచారం మేరకు ముంతాజ్ హోటల్ నిర్మాణం నిలుపుదల చేస్తున్నట్లు ,జరగబోవు టిటిడి బోర్డు మీటింగ్ లో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన 30 ఎకరాల స్థలాన్ని టిటిడి స్వాదీనం చేసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసి నిరసన విరమించినట్లు సోషల్ మీడియాలో ద్వారా తెలియజేయడం జరిగింది..ఏదేమైనా ఇది హిందూ సంఘాల పోరాట ఫలితం.ముఖ్యమంత్రి స్వయంగా తిరుమలలో ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేశారు.వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పోరాటం చేసిన ప్రతీ హిందువుల విజయం గా ఆనందం వ్యక్తంచేస్తున్నాను.
