

కవయిత్రి మొల్లమాంబ సాహితీ విజ్ఞాన పీఠం చైర్మన్ బివి కేశవులు ఉడయార్ గారు పిలుపు
మనన్యూస్,తిరుపతి:ఈనెల 13వ తేదీన కవయిత్రి మొల్లమాంబ 560 వ జయంతి కార్యక్రమానికి తిరుపతిలోని ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాలు కవయిత్రులు కవులు, మేధావులు మరియు శాలివాహనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కవయిత్రి మొల్లమాంబ సాహితీ విజ్ఞాన పీఠం చైర్మన్ బి వి కేశవులు ఉడయార్ గారు మరియు విగ్రహ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బి వి కేశవులు ఉడయార్ గారు మాట్లాడుతూ కవయిత్రి మొల్ల విగ్రహాన్ని 2021 నవంబర్ 9వ తేదీన శాలివాహన నగర్ కుమ్మరి తోపు కూడలిలో ప్రతిష్టించడం జరిగిందని చెప్పారు. కావున తిరుపతి నగరం తో పాటు పరిసర ప్రాంతాలలోని ప్రజాప్రతినిధులు, శాలివాహనులు వివిధ ప్రజా సంఘాల నాయకులు బీసీ సంఘాల నేతలు, మేధావులు, విద్యావంతులు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొల మాంబ జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
