

మనన్యూస్,తిరుపతి:సరస్వతి శిశు మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
బియమ్ ఎస్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ డైరెక్టర్ జీపాలెం తేజోవతి పాల్గొన్నారు.కార్మిక క్షేత్రంలో కూడా మహిళా సాధికారత యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు.ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలు అభ్యున్నతి ఉన్నప్పటికీ మహిళా సాధికారత పరిపూర్ణము గా సాధించాలని తెలిపారు. చట్ట సభల్లో 33% శాతం సాధించడానికి 75 ఏళ్లు పట్టింధని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ట్రేడ్ యూనియన్ రంగంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని గుర్తు చేశారు.సమాన వేతనం సాధించవలసిన అవసరం ఉందని తెలిపారు.ఈ సందర్భంగా మహిళలు అందరికీ మొక్కలను అందించారు.ఈ కార్యక్రమంలో బియమ్స్ రాష్ట్ర కార్యదర్శి బిల్లే సీనప్ప.స్విమ్స్ అధ్యక్షులు హేమ రాణి,డాక్టర్ వనజక్షి,సబ్ ఇన్స్పెక్టర్ సుమతి,అంబుజక్షి,లాయర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
