

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. రాత్రి సమయంలో కుప్పలు గమ నించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది జుక్కల్ నియోజకవర్గం లోని చిన్న కోడప్ గల్ బైపాస్ రహదారి వద్ద రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రాయి తగలడంతో గాయాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం చిన్న కొడప్ గల్, ఏకంగా టోల్ గెట్ వద్ద కూడా వరి ధాన్యాన్ని ఆరబోసి ఉన్న కానీ అధికారులు మాత్రం వారికి కనబడడం లేదా అని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బిచ్కుంద ,మెనూర్, మద్నూర్ వరకు రోడ్డుపై రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసి రాళ్లను అడ్డుగా పెడుతున్నారు దీంతో వాహనదారులు రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని వాహన దారులు, ప్రయాణికులు పోలీసులను కోరుతున్నారు.