

మనన్యూస్,తవణంపల్లి:ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్లకు ఆరు రోజుల జ్ఞానజ్యోతి”శిక్షణ కార్యక్రమం నేటితో ముగించిందని మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజ రెడ్డి గారి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి మెలకువలు, నైపుణ్యాలు పాటించాలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు నమోదును ప్రతి అంగన్వాడి సెంటర్ నుంచి పెంచాలని కోరడమైనది. నేటి కార్యక్రమంలో భాగంగా స్కూల్ రెడీనెస్ మేళా మరియు సంత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడి ఐ సి డి ఎస్ నిర్మల మేడం మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజు రెడ్డి , ఉపాధ్యాయులు మునస్వామి మరియు రిసోర్స్ పర్సన్ లు పెద్దబ్బ రెడ్డి, మధుబాబు, బాలచంద్ర రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి మరియు అంగన్వాడి సూపర్వైజర్ల పాల్గొనడం జరిగింది.