

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాతృమూర్తి గౌ శ్రీ బొజ్జల బృందమ్మ గారు బాబుఅగ్రహారం హై స్కూల్ నందు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది,మధ్యాహ్న భోజనం మరియు విద్యార్థిని,విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించి వారితో మమేకమై భోజన వసతి సౌకర్యం అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం కొంతమంది విద్యార్థులను పలకరిస్తూ మధ్యాహ్న భోజన సౌకర్యం ఎలా ఉంది అని,విద్యార్థుల యొక్క మరుగుదొడ్లలో నీళ్ల లీకేజీని స్వయంగా పరిశీలించి భోజనం యొక్క నాణ్యతను,మరుగుదొడ్లలో నీళ్ల లీకేజీని MEO గారితో చర్చించి తక్షణమే నాణ్యమైనటువంటి భోజనాన్ని మరియు నీళ్ళ లీకేజీని మెరుగుపరచాలని తెలియజేయడం జరిగింది,పై ఈ కార్యక్రమంలో మల్లీశ్వరమ్మ,పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, మాజీ టౌన్ బ్యాంకు డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు,ఉపాధ్యాయలు పాల్గొనడం జరిగింది.