

కాణిపాకం జనవరి 25 మన న్యూస్
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని కాణిపాకంలో శనివారం ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి చల్ల జై చంద్ర అన్నారు. శనివారం నియోజకవర్గంలో ని కాణిపాకంలో నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కో కన్వీనర్ చంద్ర ఆధ్వర్యంలో జరిగినది. ఎన్నికల అధికారి చల్ల జయ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించారు. అధ్యక్షులుగా లక్ష్మీపతి (టీవీ9) వర్కింగ్ ప్రెసిడెంట్ గా జె. సురేంద్ర (7 హిల్స్ టీవీ) గౌరవ అధ్యక్షులుగా మంజునాథ్ (ఆంధ్రజ్యోతి) ఉపాధ్యక్షులుగా చిరంజీవి (సూర్య) బాలయ్య (మనం) జ్యోతినాథ్ (ఆంధ్రప్రభ) ప్రధాన కార్యదర్శిగా శంకరన్ (ప్రజాశక్తి) ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామ్ కుమార్ (టాక్ ఆఫ్ ద టౌన్) ఉప కార్యదర్శిగా ప్రతాపరెడ్డి (స్వర్ణ సాగరం) నాగరాజు (మన న్యూస్) కోశాధికారిగా బాలాజీ (ఎన్ ఎస్ టి వి ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా నాయకులు కేశవులు , ప్రకాష్ ,బాలసుబ్రమణ్యం పలువురు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు