మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )
నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాలు వారికి స్థిర నివాసాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు.పేదలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
జక్కాపూర్ లో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి భూమి పూజ.
నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ భవనాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామస్థుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, సర్పంచ్ సాతెల్లి పోచయ్య,బొజ్జ అంజయ్య,వడ్ల బ్రహ్మం,సంకు లక్ష్మయ్య,నాయకులు ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్,చాకలి సాయిలు తదితరులు పాల్గొన్నారు