

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో వున్న కొండమోసూరు,కేరంగి,మిలియా కంచూరు తుమరావల్లి పంచాయితీ గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణం చేపట్టాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య పార్వతీపురం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.సోమవారం నాడు ఆయన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి,తుమరవల్లి,కొండమోసూరు గ్రామాలకు పూడి నుంచి రహదారి నిర్మాణం చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.దొర్లుద్దండి గ్రామం వరకు నిర్మించవలసిన రహదారి సగంలో విడిచిపెట్టి కాంట్రాక్టర్లు పరారయ్యారని తెలిపారు.ఈ రహదారికి 2.95 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు.అలాగే కొండ మోసూరు నుంచి అల్లం పాడు వరకు 2.75 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ పనులు జరపలేదని తెలిపారు.పై రహదారులు నిర్మిస్తే 108 వాహనం వచ్చి ఆరోగ్య ఇబ్బందులు లేకుండా,మహిళలకు ప్రసవ వేదన లేకుండా పరిష్కారం జరుగుతుందని సర్పంచ్ లచ్చయ్య తెలిపారు.వారి ఫిర్యాదును చదివిన కలెక్టర్ స్పందించి వెంటనే పరిష్కారం జరగాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.సబ్ కలెక్టర్కు రహదారి నిర్మాణం పై నివేదిక తయారు చేసి పంపాలని తెలిపారు.