

మనన్యూస్:ప్రత్తిపాడు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఊటా వీరబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కాకినాడ జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికకారిణి కామినేని జయశ్రీ,కాకినాడ జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు,ప్రతిపాడు మండల రిటర్నింగ్ అధికారి పతివాడ వెంకటేశ్వరరావు,ఎన్నికల అబ్జర్వర్ బొలిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఊటా వీరబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఊటా వీరబాబు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని,అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువఅయ్యలా అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు.అనంతరం జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ కు, సీనియర్ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు,కర్రి ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ నాయకులు పైల సుభాష్ చంద్రబోస్,ప్రతిపాడు మండల ఇన్చార్జ్ మట్టా మంగరాజు,కందా వీరాస్వామి తదితర పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.