

మనన్యూస్:గొల్లప్రోలు సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్
రైతన్న కోసం అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు126 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ అన్నసదుపాయ కేంద్రం శనివారం కూడా యథాతథంగా కొనసాగింది. పిఠాపురం దూడలసంత లో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో అన్న ప్రసాదం 800 మంది స్వీకరించారు.డొక్కాసీతమ్మ అన్న సదుపాయ కేంద్రం ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తి కి దగ్గరయ్యారు.కందుల దుర్గేశ్ చేతులు మీదుగా ఏర్పాటయిన ఈ అన్నసదుపాయ కేంద్రం పలువురు ప్రసంసలు పొందుతుంది.నిత్యం ప్రతీ వారం వందలాది మంది అన్నప్రసాదం స్వీకరిస్తు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ లను దేవుడు చల్లగా చూడాలని ఆశీర్వదించారు.అలాగే ఆయా హాస్పిటల్ కు వచ్చేఔట్ పేషెంట్లకు అన్నసదుపాయం కల్పిస్తున్నట్లు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శి మేకల కృష్ణ పాత్రికేయులకు వివరించారు.ఈ కార్యక్రమంలో జ్యోతుల సీతారాం బాబు,నక్కామణికం, బొత్స శ్రీకాంత్,ఎద్దు రాజు,నాని, గణేష్,విప్పర్తి శ్రీను, అల్లం కిషోర్ పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు తదితరులు పాల్గొన్నారు.