

మనన్యూస్:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ అభివృద్ధికై పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేత కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నందు కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ బండి సంజయ్ గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శ్రీ స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే కోరారు నవోదయ స్కూల్,సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తో పాటు గట్టులో ట్రామా కేవ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు.అలాగే గద్వాల-రాయచూర్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని,ప్రజల రాకపోకలతో పాటు రవాణా సౌలభ్యం పెరుగుతుందని రాయచూర్ ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ పాటిల్ కలిసి ఎమ్మెల్యే కోరారు.
కేంద్ర మంత్రి స్థానికులంగా స్పందించారు త్వరలో నే గద్వాల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ దౌలు, రాయచూర్ కౌన్సిలర్ తిమ్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు నాయకులు ఉరుకుందు, గోవిందు, కురుమన్న, ధర్మ నాయుడు యుగంధర్ గౌడ్ కొత్త గణేష్, రాజు నాగార్జున,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.