కలిగిరి, నవంబర్ 5 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు):*

కలిగిరి మండల కేంద్రంలోని *జడ్పీపీ హైస్కూల్ నందు ఉదయం 7 గంటల నుండి* *జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా* స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వర్షం కురుస్తున్నా సరే ఓటర్లు దానిని ఏ మాత్రం లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు.ఉదయం 7 గంటల నుండే కురుస్తున్న వర్షంలో గొడుగులు పట్టుకుని, బురద రోడ్లలో నడుచుకుంటూ, వృద్ధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. బురదలో కాళ్లు కూరుకుపోతున్నా సరే, ఓటు వేయాలనే పట్టుదలతో క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు.ఓటు వేయడం మన బాధ్యత అని, వర్షం వచ్చినా, బురద ఉన్నా ఓటు వేయకుండా వెనక్కి తగ్గేది లేదని ఓటర్లు చెప్పడం విశేషంగా నిలిచింది.వర్షంలోనూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *