కలిగిరి, అక్టోబర్ 29, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం *కృష్ణారెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోకల యమున* ఎన్నికల ప్రచారంలో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.గ్రామంలోని ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరుగుతూ మహిళలను, పెద్దలను కలుస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మహిళా అభ్యర్థిగా మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు* నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా..- *పింఛన్ల పెంపు:* వృద్ధుల పింఛన్ రూ.4000, వికలాంగులకు రూ.6000, కిడ్నీ బాధితులకు రూ.10,000 కు పెంచి ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకు అందిస్తోంది.మహిళా సంక్షేమం మహిళల ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఆయన ఆశీస్సులతో కృష్ణారెడ్డిపాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తానని, ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.గ్రామానికి ఒక ఆడబిడ్డగా సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.ఈ ప్రచారంలో ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, బుజ్జయ్య, బుసిరెడ్డి, మహేశ్వరరావు, వెంకటనరసయ్య,రాజబాబు, వెంకటరామిరెడ్డి, మల్లీశ్వరరెడ్డి, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని తోకల యమునకు మద్దతు తెలిపారు.
