స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలి

: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

*తిరుపతి, అక్టోబరు 29 : తిరుపతి నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికలు –2026 నిర్వహణలో భాగంగా ఓట్ల తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లను ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ లతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా ఉండేలా చూడాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భద్రత, రిసెప్షన్ ఏర్పాట్లు, ఇతర సౌకర్యాల కల్పనలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, ఎలక్షన్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఎన్నికల సిబ్బంది, మున్సిపల్ కార్యాలయపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—డి.ఐ.పి.ఆర్.ఓ. తిరుపతి—-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *