ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, కూటమి అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు.

అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, నియోజకవర్గ సమగ్ర వికాసానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

స్థానిక ప్రజలతో నేరుగా మమేకమవుతూ, ప్రచారంలో భాగంగా ప్రతి ఇల్లు తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అమూల్యమైన ఓటును వేయవలసిందిగా సుధీర్ రెడ్డి ప్రజలను సవినయంగా కోరారు.

కూటమి అభ్యర్థుల భారీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ప్రచారాన్ని దిగ్విజయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *