డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు పిలుపు..
తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో నాగలాపురం పట్టణం, నందు నాగలాపురం మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఇళయరాజా,నాగలాపురం సెగ్మెంట్ -2 ఎంపీటీసీ అభ్యర్ధి
షణ్ముగం గెలుపు కొరకు ప్రచారం నిర్వహించడం జరిగినది.
డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక ఓట్లతో బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి,సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్,జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా,జిల్లా కార్యదర్శి మణి దేవదానం,జిల్లా ఎస్ టి సెల్ చైర్మన్ జ్యోతేశ్వర్ నాయక్,జిల్లా కలెక్టరేట్ రెప్రజెంటేటివ్ చైర్మన్ చిరంజీవి,జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రేమసుందరం, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి,నాగలాపురం మండలం అధ్యక్షులు తిరుమలై,సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు సునీల్ రెడ్డి, జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

