
అపోలో హాస్సిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి
తవణంపల్లె, అక్టోబరు 27 మన ద్యాస
దేశంలో ప్రతిఒక్కరికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందాలన్నాదే తన అకాంక్ష అని అపోలో హాస్సిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా అరగొండ అపోలో ఆస్పత్రి ద్వారా వెయ్యి మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అపోలో అస్పత్రి సంపూర్ణ ఆరోగ్యపథకం కార్యాలయంలో జాతీయ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులకు చి కిత్సలు అందించడం తోనే సంరక్షణ పూర్తి కాదని, ప్రజలు నివసించే పరిస్థితులు, పోషకాహారం, విద్య, జీవనోపాధి కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. పెద్ద నగరాలతో పాటు మారు మూల గ్రామాల్లోనూ ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలతో పాటు సమాజ సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ అపోలోఫౌండేషన్ చేపట్టిన సంపూర ఆరోగ్య పథకం కార్యక్రమం ఫలితానిస్తోందని ఆయన తెలిపారు. తన స్వగ్రామమైన అరగొండలో ప్రారంభమైన ఈకార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 48.3 కోట్లు మందికి వివిధ రూపాల్లో సేవలందించినట్లు తెలిపారు. 2013లో అరగొండలో ప్రారంభమైన ఈకార్యక్రమం నేడు 23కు పైగా ప్రాంతాలకు విస్తరించినట్లు చెప్పారు. ఈకార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా 10.89 లక్షల మందికి పైగా పౌష్టికాహార భోజనాలు అందించినట్లు ప్రతాప్.సి.రెడ్డి తెలిపారు.