పొన్నలూరు మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించింది. జడ్పిటిసి అభ్యర్థితో పాటు, మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విత్ డ్రా రోజున వైసీపీ జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు తమ నామినేషన్ లను స్వచ్చందంగా విరమించుకున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీలోని ఇతర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను విరమించుకోవడంతో ఎన్నికల అధికారులు 12 మంది ఎంపిటిసి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పలదిన్నె గ్రామానికి చెందిన పూరిమిట్ల మాధవి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికవగా,
మండలంలోని సింగరబొట్లపాలెం నుంచి దాసరి దత్తాత్రేయ, చెరుకూరు నుంచి తన్నీరు వీరమ్మ, చెన్నిపాడు నుంచి మాదాల శ్రీను, పొన్నలూరు నుంచి కొత్తకోట పద్మ, తిమ్మపాలెం నుంచి గెట్టెబోయిన శారద, రావులకొల్లు నుంచి అనుమోలు సరస్వతి, వెల్లటూరు నుంచి పూరిమిట్ల రత్నమ్మ, బోగనంపాడు నుంచి పిల్లి వెంకట కృష్ణారెడ్డి, మాలపాడు నుంచి పసల వెంకటరావు, కోటపాడు నుంచి అన్నెం రోశమ్మ, చౌటపాలెం నుంచి పాతూరి సుజాత, ఇప్పగుంట నుంచి నన్నం అలరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.దీంతో పొన్నలూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నింటినీ టీడీపీ కైవసం చేసుకున్నట్లయింది. మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *