ఆర్నాబ్ తుఫాన్ ప్రభావిత నేపద్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, తీవ్ర ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని మంత్రి కోరారు అధికారుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఏవైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని, ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి డా. డోలా శ్రీ వీరాంజనేయస్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *