గడపగడపకూ అభివృద్ధి నినాదం: జేబీ శ్రీనివాస్ , బట్టే వెంకట కీర్తి తరపున తుడా ఛైర్మన్ ప్రచారం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రచారం సందడి ఊపందుకుంది. తిరుపతి అక్టోబర్ 27.
ఈరోజు కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ,డివిజన్ అభ్యర్థి కీర్తి తరుపున తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ,గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ , తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.
నాయకులందరూ డివిజన్లోని ప్రతి గడప కూ వెళ్లి,ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ కూటమి తరుపున 32 వ డివిజన్ తెదేపా అభ్యర్థి బట్టే వెంకట కీర్తి ని మరియు మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ప్రచారానికి విచ్చేసిన డా. డాలర్స్ దివాకర్ రెడ్డి కి, సుగుణమ్మ కి , ఆరణి శ్రీనివాసులు కి మరియు మేయర్ మరియు డివిజన్ అభ్యర్థులకు డివిజన్ ప్రజలు హారతులు పట్టి, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:గతంలో తిరుపతి నగర అభివృద్ధికి, పచ్చదనం మరియు సుందరీకరణకు చేసిన కృషిని ప్రజలకు వివరించారు.
రాబోయే రోజుల్లో డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, త్రాగునీరు, రహదారుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, ఎన్నికల అనంతరం వాటిని వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
మహిళల సంక్షేమం, నగర పరిశుభ్రత, పచ్చదనం పెంపుదలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం సభ్యులు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని జయప్రదం చేశారు.


