కలిగిరి, అక్టోబర్ 25 మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని లక్ష్మీపురం ఎంపీటీసీ స్థానం టీడీపీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం ఎంపీటీసీ సెగ్మెంట్ కు టీడీపీ నుండి ఇద్దరు బలమైన ఆశావహులు పోటీ పడ్డారు. ఒకరు ఆళ్ల రామచంద్రయ్య కాగా, మరొకరు జొన్నలగడ్డ తారాబాయి.ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. దీంతో లక్ష్మీపురం పరిధిలో ఎవరికి టికెట్ దక్కుతుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్  కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించరు.అయితే ఈ ఉత్కంఠకు నేటితో తెరపడింది. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నుండి జొన్నలగడ్డ తారాబాయికి అధికారికంగా బీ-ఫామ్ లభించింది. పార్టీ పెద్దలు జొన్నలగడ్డ తారాబాయి పేరును ఖరారు చేయడంతో ఈ పంచాయితీకి ఫుల్ స్టాప్ పడింది.బీ-ఫామ్ జొన్నలగడ్డ తారాబాయికి రావడంతో రెండవ అభ్యర్థి అయిన ఆళ్ల రామచంద్రయ్య తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో లక్ష్మీపురం ఎంపీటీసీ బరిలో జొన్నలగడ్డ తారాబాయి మాత్రమే టీడీపీ అభ్యర్థిగా నిలవనున్నారు.పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆళ్ల రామచంద్రయ్య వెనక్కి తగ్గడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తారాబాయి గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరియు కలిగిరి మండల నాయకులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *