తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్‌లో ఎన్డీయే కూటమి ప్రచారం జోరందుకుంది. కూటమి బలపరిచిన భాజపా పార్టీ అభ్యర్థి సామంచి శ్రీనివాస్ కి మద్దతుగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి డివిజన్ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లోని ప్రతి గడపకూ వెళ్తూ, ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తిరుపతి నగర సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని,21వ డివిజన్ ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు సామంచి శ్రీనివాస్ అని ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.21వ డివిజన్‌ను ఒక ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని, డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో తిరుపతి రూపురేఖలు మారుస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల డివిజన్ నేతలు, మహిళా విభాగం నేతలు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *