*నెల్లూరు, అక్టోబర్ 19, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్, బుచ్చి, ఆత్మకూరు మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది.జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్లు భారీగా దాఖలు కావడంతో ఎన్నికల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.నెల్లూరు మేయర్ స్థానానికి మొత్తం 35 మంది నామినేషన్లు దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార టీడీపీ నుంచి 5 మంది, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది నామినేషన్లు వేశారు. వీరితో పాటు ఇతరులు, స్వతంత్రులు 20 మంది బరిలో నిలిచారు. మేయర్ పీఠం కోసం భారీ పోటీ నెలకొనడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠానికి* మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 4, వైసీపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1, ఇతరులు 2 నామినేషన్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు.బుచ్చి మున్సిపాలిటీ చైర్మన్ పదవికి 9 మంది పోటీ పడుతున్నారు. ఇందులో టీడీపీ నుంచి 5, వైసీపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1 నామినేషన్లు దాఖలయ్యాయి.నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో ఎంతమంది మిగులుతారనేది ఆసక్తికరంగా మారింది.