ఐరాల సెప్టెంబర్ 28 మన ద్యాస(నాగరాజ సరకింటి)
అగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభిమన్యు యూత్ ఎంపవర్‌మెంట్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చూపిన విప్లవ స్ఫూర్తి, జ్ఞానం, దేశభక్తి, సామాజిక బాధ్యత గురించి విద్యార్థులకు వివరించారు. చిన్న వయసులోనే దేశం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాన్ని, దేశం పట్ల ఆయనకున్న బాధ్యతను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

అలాగే ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, అన్యాయాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించే తత్వాన్ని యువత అలవర్చుకోవాలని అభిమన్యు యూత్ ఎంపవర్‌మెంట్ ప్రతినిధులు విద్యార్థులకు సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమం అనంతరం పాఠశాలకు భగత్ సింగ్ చిత్రపటాన్ని అభిమన్యు యూత్ ఎంపవర్‌మెంట్ సభ్యులు బహూకరించారు.

ఈ కార్యక్రమంలో అభిమన్యు యూత్ ఎంపవర్‌మెంట్ తరఫున తేజో కృష్ణ బుసినాయని, అశోక్, యువరాజ్ స్వేరో, అజిత్ శ్రీరాముల, లాలూ ప్రసాద్, పృథివి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *