రేణిగుంట:

రేణిగుంట మండలం, గుంటకట్ట వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన విద్యా కమిటీ చైర్మన్‌గా రోజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పనే ధ్యేయంగా కమిటీ నూతన సభ్యులను, నాయకులను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా స్కూల్ చైర్మన్‌గా రోజా ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ రోజా మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, స్థానికుల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *