బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండ
అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.ఈరోజు తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి , పార్లమెంట్ స్థానిక ఎన్నికల పరిశీలకులు నుకసాని బాలాజీ ,తిరుపతి తెదేపా ఇంచార్జి జేబీ శ్రీనివాస్ తో కలిసి బాధితుడికి అందజేశారు.దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు.ప్రజారోగ్యానికి మరియు ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
