__హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రూ. 106 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.
__ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరుపతి రూపురేఖలు మారబోతున్నాయి.
__కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు , మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ , పనబాక లక్ష్మి , నుకసాని బాలాజీ ,సుగుణమ్మ , జేబీ శ్రీనివాస్ ,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు.
పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానం ద్వారా సుమారు రూ. 106 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బృహత్తర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.ఈ వర్చువల్ కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:హ్యామ్ ప్రాజెక్టు కింద నగర వ్యాప్తంగా అత్యాధునిక బీటీ/సీసీ రహదారులు, సరికొత్త వీధి దీపాల వ్యవస్థ మరియు సమగ్ర డ్రైనేజీ/కాలువల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతోందని తెలిపారు.జిల్లా యంత్రాంగం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మరియు తుడా పూర్తి సమన్వయంతో పనిచేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత వ్యవధిలో ఈ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు,మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

