స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్స్వీపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచే వ్యూహం
__తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు,ముఖ్య నేతల దిశానిర్దేశం.
__ తెదేపా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు నూకసాని బాలాజీ అధ్యక్షతన క్లస్టర్,బూత్ ఇన్ఛార్జ్ ల సన్నాహక సమావేశం
__సమగ్ర దిశానిర్దేశం చేసిన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి ,నరసింహ యాదవ్ , జేబీ శ్రీనివాస్ .
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని క్లస్టర్, బూత్ 1, 2, 3 ఇన్ఛార్జ్ల తో సమన్వయ మరియు దిశానిర్దేశక సమీక్షా సమావేశం తిరుపతి పార్లమెంట్ కార్యాలయం లో జరిగింది.ఈ సమావేశంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో డా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత క్లస్టర్, బూత్ స్థాయి నాయకులపై ఉందన్నారు.ప్రజా సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందాలని,స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలి తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో క్లస్టర్, బూత్ ఇన్ఛార్జ్ల మధ్య సమన్వయం అత్యంత కీలకమని,ఓటర్ల జాబితా పరిశీలన, ఓటరు చేర్పులు-మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు,తిరుపతి నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ కమిటీల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

