అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన రథోత్సవ ఘట్టం మంగళవారం తిరుమాడ వీధుల్లో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు సర్వాభరణ భూషితులై మహోన్నత రథంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.

గోవింద నామస్మరణలతో మారుమోగుతున్న మాడ వీధుల్లో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో శ్రీవారికి పూజలు నిర్వహించి, రథం తాడు పట్టి ముందుకు లాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *