తవణంపల్లి, సెప్టెంబర్ 20 మన ద్యాస(నాగరాజ సరకింటి)
తవణంపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీ వెంకటేశ్వర చౌదరి 53వ జన్మదిన వేడుకలు జి.గొల్లపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తవణంపల్లి నుంచి జి.గొల్లపల్లి వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం జి.గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 53 కేజీల భారీ కేక్‌ను వెంకటేశ్వర చౌదరి పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ భాస్కర్ నాయుడు, మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.సునీల్ కుమార్ చౌదరి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ నాయుడు, అర్ధగిరి ఆలయ చైర్మన్ రఘు,పాలక మండలి సభ్యులు పాక్స్ చైర్మన్త రంజిత్‌ది రెడ్డి తదితరులు హాజరయ్యారు.అలాగే మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ జడ్పీటీసీ సభ్యులు భీమినేని చిట్టిబాబు, కోదండయ్య, బాబురావు, పెనుమూరు మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, యాదమరి మండల పార్టీ అధ్యక్షుడు మొరార్జీ యాదవ్, క్లస్టర్ ఇన్చార్జులు ఎంఆర్సీ మోహన్ నాయుడు, ప్రవీణ్, దేవాజీ, చిట్టినాయుడు, చిత్ర, రాళ్లపల్లి మోహన్ నాయుడు, మేదరమిట్ట మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.పార్టీ నాయకులు పరంధామనాయుడు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది.