వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అసంఘటిత సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు సింగరాయకొండ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన తీర ప్రాంతం పరిశీలిస్తూ సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో సమీక్షిస్తూ
నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు .చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
గజ ఈత గాళ్ళకు ప్రత్యేకంగా టీషర్టుల తో విధులు నిర్వహించాలన్నారు.
వినాయక నిమజ్జన ప్రాంతాల్లో డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలన్నారు. అలాగే వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనం దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో అధిక సంఖ్యలో జరిగే ప్రాంతం లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు నిమజ్జనల వద్ద డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచటం, భద్రతా సిబ్బంది, ప్రత్యేక పోలీసు బృందాలు కూడా విధుల్లో ఉంటారని భక్తులు, ప్రజలు సహకరించాలన్నారు. విగ్రహాల నిమజ్జనాల్లో ఎలాంటి అపశ్రుతులు లేదా అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు సంభవించకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు, మెరైన్ పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు,ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు టు టౌన్ సీఐ వీర నాయక్,ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు,కొత్తపట్నం మెరైన్ సీఐ రమేష్ బాబు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్, సింగరాయకొండ ఎస్సై సుధీర్ కుమార్, మెరైన్ ఎస్సై సుబ్బారావు మరియు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *