తవణంపల్లె, సెప్టెంబర్ 15 మన ద్యాస(నాగరాజ సరకింటి )
తవణంపల్లె మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ ఎం సీ ) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మండల విద్యాశాఖ అధికారి హేమలత ఏం ఈ ఓ కార్యాలయం నుంచి మంగళవారం ఎన్నికల ప్రకటన జారీ చేశారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో ఎస్ఎంసీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఎన్నికల షెడ్యూల్ ఇలా.సెప్టెంబర్స 15 సభ్యులు, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల. ఉదయం 10 గంటలకు ప్రక్రియ ప్రారంభం.సెప్టెంబర్ 18:ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను పాఠశాల నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జాబితా ప్రదర్శన ఉంటుంది.సెప్టెంబర్ 25:ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరణకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం కేటాయించారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసి నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు.సెప్టెంబర్ 29:ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించి కమిటీని ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎస్ఎంసీ సభ్యుల ద్వారా చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఎంసీ సభ్యులు, చైర్పర్సన్, వైస్చైర్పర్సన్తో ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు తొలి ఎస్ఎంసీ సమావేశం నిర్వహించనున్నారు.మండలంలోని అన్ని పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.