తిరుపతి, సెప్టెంబర్ 11: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ తమ్ముడు పరమానంద్ మరియు గుండ్రాజు మురళి రాజు ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు వినాయక వ్రత కల్పం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీచర్ బి. శుభాషిణి మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో వినాయక చవితి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.కె. అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో భక్తులు పూజా విధానాన్ని సులభంగా అర్థం చేసుకొని, భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలనే ఉద్దేశం తోనే ఈ పుస్తకాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఎస్. తేజో కుమారి మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలను వినాయకుని దగ్గర పెట్టి విద్యా బాగా అభ్యసించాలని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలు చేరాలని భక్తిశ్రద్ధలతో మొక్కుకోవాలని హితవు పలికారు. పాపా నాయుడు పేట లోని బాపూజీ విద్యాసంస్థల డైరెక్టర్ వేమూరి అనిల్ కుమార్ చేతుల మీదుగా వినాయక వ్రత కల్పం 2026 పుస్తకాన్ని విడుదల చేసి ఉపాధ్యాయులకు స్కూల్ పిల్లలకు పూజా విధానాన్ని తెలిపే పత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు.

