మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ఎన్నికల సమయంలో పోలీస్ నిఘా ఉన్నా, పోలీస్, ఎక్సైజ్, ఈగల్ , టాస్క్ ఫోర్స్ హెచ్చరిక చేస్తున్నా అక్రమ మద్యం చెలామణి, అక్రమ నిల్వలు, లావాదేవీలు జరుగుతున్నాయని అందిన సమాచారం తో జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో జిల్లా కేంద్రం నుండి వచ్చిన టాస్క్ ఫోర్స్ సి ఐ కమలాకర్ ఆధ్వర్యం లో ఎస్సై చెంచయ్య సిబ్బంది సింగరాయకొండ లో దాడులు నిర్వహించి 30 మద్యం సీసాలు వాటిని అనుమతి లేకుండా అక్రమంగా కలిగి ఉన్న ఇద్దరిని అదుపు లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అనధికారికంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు బెల్ట్ షాపు ల సమాచారం తో దాడులు చూసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. సింగరాయకొండ మండలం కలికవాయ గ్రామం లో అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తి నుండి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.అదే విధంగా హై వే వద్ద నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం బాటిళ్లు కలిగి ఉన్న వారిని, మద్యం బాటిళ్ల ను సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించి తదుపరి విచారణ చేపట్టారు.