తవణంపల్లి, సెప్టెంబర్ 8 మన జైత్రయాత్ర :

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం VB-GRAMG పథకం ద్వారా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఏపీఓ బాల తెలిపారు. రైతుల వ్యవసాయ భూముల్లో ఉత్పాదక ఆస్తులను అభివృద్ధి చేయడంతో పాటు ఉపాధి కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ఉపాధి హామీ పథకం కింద వివిధ వ్యవసాయ అనుబంధ పనులు చేపట్టడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని తెలిపారు.అర్హతలు:• రైతుకు ఉపాధి హామీ జాబ్‌ కార్డు ఉండాలి.• రైతు కుటుంబానికి 5 ఎకరాలలోపు భూమి ఉండాలి.• సంబంధిత పశుసంవర్ధక శాఖ ద్వారా దరఖాస్తు పరిశీలించి ఆమోదం పొందాలి.• అర్హత నిర్ధారణ అనంతరం ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం పనులు మంజూరు చేస్తారు.కరువు పరిస్థితుల్లో రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు వారి వ్యవసాయ భూముల్లో ఉపయోగకరమైన ఆస్తులను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఏపీఓ బాల తెలిపారు. తవణంపల్లి మండలంలోని అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం సంబంధిత పశుసంవర్ధక శాఖ కార్యాలయం లేదా ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *