కలిగిరి, అక్టోబర్ 26 మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

కలిగిరి బిట్-2 లో ముమ్మరంగా కొనసాగుతున్న స్థానిక ఎన్నికల ప్రచారం ఎంపీపీ అభ్యర్థిగా బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థిగా బండారు మల్లికార్జున ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు.జెడ్పీటీసీ అభ్యర్థిగా మెట్టుకూరి శిరీష రెడ్డిని, ఎంపీపీగా బిజ్జం వెంకట కృష్ణారెడ్డిని, బిట్-2 ఎంపీటీసీగా బండారు మల్లికార్జునను గెలిపించాలని వారు కోరారు.గెలిచిన వెంటనే స్థానిక బజార్లలో సైడ్ కాలువలు, తాగునీటి సమస్య పరిష్కారం, సిమెంట్ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఆదరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తోందని, తప్పకుండా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు భరోసా ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు – ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ సభ్యుడు కాకు మహేష్, జనసేన అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ, టీడీపీ గ్రామ అధ్యక్షులు చేరెడ్డి సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య, బూత్ ఇంచార్జ్ నిస్సంకర సురేష్, పుల్లా వెంకటేష్, బండారు మనోహర్, బాబీ తదితరులు పాల్గొన్నారు.
