చిత్తూరు, సెప్టెంబర్ 8 మన ద్యాస
చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా డీఎస్ఓ (జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి) వెంకటరాముడు ని జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వైస్ ప్రెసిడెంట్ అవార్డు రవి ఆధ్వర్యంలో సభ్యులు డీఎస్ఓను దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లాలో వినియోగదారుల సమస్యలు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్కు సంబంధించిన పలు అంశాలపై డీఎస్ఓతో చర్చించారు.వినియోగదారుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్లో నిర్వహించబోయే కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికపై సభ్యులు డీఎస్ఓకు వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని ఈ సందర్భంగా సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సభ్యులు గాయత్రి, రామచంద్ర, హరీష్ కుమార్, అనంత కుమార్, పాల్గొన్నారు.