సింగరాయకొండ గీతం స్కూల్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం విద్యాసంస్థ చైర్మన్ లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినం కావున కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటామని విద్యార్థులు చిన్నతనం నుంచే భక్తి మార్గంలో నడవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఉట్టి కార్యక్రమంలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ధనలక్ష్మి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *