మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
మాలల జేఏసీ మరియు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన మార్కాపురం పట్టణంలో నిర్వహించనున్న “రాజ్యాంగ పరిరక్షణ సభ” ను విజయవంతం చేయడానికి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు మాల సోదరులు, ఉద్యోగులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో మార్కాపురానికి తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తుల్లిబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నిర్వహిస్తున్న ఈ సభకు మాల ఉద్యోగులు, మహిళలు, యువతతో పాటు రాజ్యాంగ పరిరక్షణను కోరుకునే ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మాలలు జేఏసీ ఉపాధ్యక్షులు పులగుర కృష్ణయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 6న జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ జడ్జి, ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్, రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు, ప్రముఖ గాయకులు, రచయిత రేంజర్ల రాజేష్, రాష్ట్ర మాలల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్, మాలల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పండు అశోక్, మాలల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామల సుదర్శన్ తదితరులు హాజరుకానున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామవరపు రాంబాబు, బాల నారాయణ , శాంతరాజు టీ. క్రాంతి కుమార్ శ్రీను మరియు మాల జేఏసీ దళిత నాయకులు పాల్గొని మార్కాపురం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 4 గంటలకు మార్కాపురం బస్‌స్టాప్ సమీపంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుంచి కంభం రోడ్డులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.అనంతరం అదే ప్రాంగణంలో రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.మాలల జేఏసీ మార్కాపురం జిల్లా అధ్యక్షుడు మాలపోలు శాంతకుమార్, మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మంచాల సాయి, గౌరవ అధ్యక్షులు శాంతరాజు గారు, గౌరవ సలహాదారు జనుమాల నాగయ్య మరియు జిల్లా నాయకత్వం మాట్లాడుతూ, “సెప్టెంబర్ 6న చలో మార్కాపురం” కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.