జనసేన పార్టీ తరఫున వినతిపత్రం అందజేత.

రేణిగుంట ఆగష్టు 23.
తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి ప్రజల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి కి అందజేశారు. శ్రీకాళహస్తిలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడం, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన హోం మంత్రి వంగలపూడి అనిత శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ తో పాటు జనసేన నాయకులు కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *