Mana News:- స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి “రామం రాఘవం” నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14, 2025 న రామం రాఘవం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ , తెలిసిందా నేడు సాంగ్ కు మంచి స్పందన లభించింది.ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. రామం రాఘవం చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ‘రామం రాఘవం’తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *